Page Loader
MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ
వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ

MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇకపై ప్లేఆఫ్ రేసులో మిగిలిన రెండు కీలక జట్లు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ వర్షం ముప్పు కమ్ముకోవడంతో మ్యాచ్ జరగుతుందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. బుధవారం నగరమంతటా కుండపోత వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మంగళవారం ముంబై నగరంలో కురిసిన వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లు కూడా కుదించారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య జట్ల ట్రైనింగ్ ప్లాన్ చేయగా, వర్షం కారణంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ మద్యలోనే ఆపేశారు.

Details

మ్యాచ్‌కు ఫలితమే ప్లేఆఫ్ టికెట్

ముంబై ఆటగాళ్లు తొలుత వెనుదిరిగిపోగా, ఢిల్లీ ప్లేయర్లు కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ మ్యాచ్ రెండూ జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్‌కు చేరగా, నాలుగో స్థానం కోసం పోటీ మిగిలిన జట్ల మధ్య నడుస్తోంది. ముంబై ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్నట్టు, ఈ మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుని నేరుగా నాకౌట్‌కు చేరుతుంది. ఢిల్లీ గెలిస్తే మాత్రం 15 పాయింట్లు అవుతాయి. తద్వారా వారి ఆశలు కొనసాగుతాయి. తర్వాతి మ్యాచ్ మే 24న పంజాబ్‌తో జరగనుండగా, అదే ఫైనల్ అవకాశాన్ని నిర్ణయించనుంది.

Details

వర్షం ఎఫెక్ట్‌కి అదనపు గంట

ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో సాధారణంగా ఒక గంట అదనంగా కేటాయించారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మే 21 నుంచి జరిగే మ్యాచ్‌లకు అదనంగా మరో గంట వరకూ వేచిచూడే అవకాశం కల్పించారు. అంటే వర్షం వల్ల ఆట ఆలస్యం అయితే 2 గంటల వరకూ వేచి చూసే అవకాశముంది.

Details

ప్లేఆఫ్ రేసులో పరిస్థితి

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైద‌రాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ముంబై-ఢిల్లీ మ్యాచ్ మరింత కీలకంగా మారింది. విశ్లేషకుల మాటల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి మళ్లీ నాకౌట్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా. వాతావరణం అనుకూలిస్తే, ఈ మ్యాచ్ టికెట్ ఫైట్‌ను తేల్చేయనుంది.