
IPL 2024 Auction : ఐపీఎల్ 2024 వేలం.. డబ్బెంత? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు.
ఇందులో 119 మంది విదేశీయులున్నారు. 10 ఫ్రాంచైజీలలో 77 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
కొందరు ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది.
ఐపీఎల్ 2023 వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానున్న నేపథ్యంలో డేట్, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ లాంటి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
ఈ మినీ వేలం దూబాయ్‌లోని కోకా-కోలా ఏరేనా హోటల్‌లో డిసెంబర్ 19న జరగనుంది.
మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు వేలం ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో నిర్వాహకులు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు.
Details
ఐపీఎల్ వేలాన్ని నిర్వహించనున్న మల్లికా సాగర్
ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంచైజీలు కలిపి రూ.262.95 కోట్లు వెచ్చించనున్నాయి.
అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద 38.15 కోట్లు ఉండగా, అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.15 కోట్లు మాత్రమే ఉన్నాయి.
ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, స్టార్క్, కొయిట్జీ లాంటి ప్లేయర్లపై అధిక ధరను వెచ్చించే అవకాశముంది.
ఈ వేలంలో దక్షిణాఫ్రికాకు చెందిన 17ఏళ్ల క్వేనా మఫాకా పిన్న వయస్కుడు కాగా, ఆప్గాన్ కు చెందిన మహమ్మద్ నబీ (38 ఏళ్లు) అత్యధిక వయస్కుడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించిన మల్లికా సాగర్ ఈ ఐపీఎల్ వేలాన్ని నిర్వహించనున్నారు.