Page Loader
CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమి
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమి

CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
07:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్-18 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌కు మరోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో సీఎస్కే 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది చెన్నైకు వరుసగా మూడో ఓటమిగా నిలిచింది. 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయ్ శంకర్ (69 నాటౌట్; 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ చెప్పుకోతగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. రచిన్ రవీంద్ర 3, డేవాన్ కాన్వే 13, రుతురాజ్ గైక్వాడ్ 5, శివమ్ దూబే 18, రవీంద్ర జడేజా 2 పరుగులతో విఫలమయ్యారు.

Details

మూడో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ

కెప్టెన్ ఎంఎస్ ధోనీ 26 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సుతో 30 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు తీసినా, మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, కుల్‌దీప్ యాదవ్ ఒక్కొక్కరు చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో దిల్లీ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన దిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (77; 51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించాడు. అభిషేక్ పొరెల్ 33 పరుగులు (20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) చేసి మద్దతిచ్చాడు.

Details

మిడిలార్డర్ లో రాణించిన ఢిల్లీ బౌలర్లు

మిడిలార్డర్‌లో అక్షర్ పటేల్ (21; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), సమీర్ రిజ్వీ (20; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) తమదైన పాత్ర పోషించారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (22 నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి ముగింపు ఇచ్చాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసినట్లే, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీశా పతిరన చెరో వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఢిల్లీ