Loading...
IPL Releases: ఖరీదైన ప్లేయర్లను వదిలేసిన ప్రాంచైజీలు...కారణం చెప్పిన పూజారా
ఖరీదైన ప్లేయర్లను వదిలేసిన ప్రాంచైజీలు...కారణం చెప్పిన పూజారా

IPL Releases: ఖరీదైన ప్లేయర్లను వదిలేసిన ప్రాంచైజీలు...కారణం చెప్పిన పూజారా

వ్రాసిన వారు Balachander Sharma
Nov 08, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల లెక్కలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లను కూడా వదిలేయడానికి జట్లు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ 17లోగా రిటెన్షన్‌ జాబితాను సమర్పించాల్సి ఉండటంతో ఇప్పుడు ప్రతి ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లపై లెక్కలు వేసుకుంటోంది. ట్రేడింగ్‌ ద్వారా మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్‌ చెతేశ్వర్‌ పుజారా ఆసక్తికరమైన అంచనాలు చేశాడు. ముఖ్యంగా భారీ ధర పలికిన విదేశీ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పాడు. పేరు, ధర కంటే గత సీజన్‌ ప్రదర్శనను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది.

Details

రూ.25.20 కోట్ల గ్రీన్‌కు షాక్‌?

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్‌ గ్రీన్‌ను ఈసారి విడుదల చేసే అవకాశం ఉందని పుజారా అభిప్రాయపడ్డాడు.

అయితే వేలంలో మళ్లీ అతడినే తక్కువ ధరకు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి మ్యాట్‌ హెన్రీ, మాథ్యూ షార్ట్‌ వెళ్లొచ్చని అంచనా వేశాడు.

మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ పెద్దగా మార్పులు చేయకపోవచ్చని పేర్కొన్నాడు.

Details

మరికొన్ని జట్లలోనూ భారీ మార్పులు

గుజరాత్‌ టైటాన్స్‌ తెవాతియా, షారుక్‌ ఖాన్‌ విషయంలో ఆలోచించాల్సి రావచ్చని పుజారా చెప్పాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి జయదేవ్‌ ఉనద్కట్‌, హర్షల్‌ పటేల్‌ విడుదలయ్యే అవకాశముందని అంచనా వేశాడు.

పంజాబ్‌ కింగ్స్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌, జేవియర్‌ బార్టెట్‌, లాకీ ఫెర్గూసన్‌లను వదిలేయొచ్చని తెలిపాడు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జట్లు తమ బడ్జెట్‌ను కూడా తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి.

ADVERTISEMENT

Details

రూ.21 కోట్ల పూరన్‌పైనా వేటు?

అత్యంత ఆసక్తికరమైన పేరు నికోలస్‌ పూరన్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతడికి రూ.21 కోట్లు చెల్లిస్తోంది. అయినప్పటికీ పుజారా అంచనా ప్రకారం పూరన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

అతడితో పాటు ఆయుష్‌ బదోనీ కూడా జాబితాలో ఉండొచ్చని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి పృథ్వీ షా, కరుణ్‌ నాయర్‌ కూడా బయటకు వెళ్లే అవకాశముందని తెలిపాడు.

మొత్తంగా చూస్తే ఈసారి రిటెన్షన్‌ జాబితా పేర్ల కంటే డబ్బు-ప్రదర్శన లెక్కల చుట్టూనే తిరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT