ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆ రోజునే!
ఆసియా కప్ వివాదంపై త్వరలోనే సస్పెన్స్ వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసియా కప్ నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ కోసం షెడ్యూల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఆసియాకప్ కు పాక్ ఆతిథ్యమివ్వడంతో పాకిస్థాన్ లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. ప్రస్తుతం పాకిస్థాన్, శ్రీలంక రెండు దేశాల్లో ఆసియా కప్ నిర్వహించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇండియా కప్ ఆడనున్న మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా మిగిలిన మ్యాచులకు పాకిస్థాన్‌లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది.
ఇండియా, పాక్
ఇండియా-పాక్ హై ఒల్టోజ్ మ్యాచ్ సెప్టెంబర్ 3న జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచుకు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదిక కానున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆసియా కప్ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఆసియా కప్ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఇరు జట్లు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ తర్వాత వన్డే వరల్డ్ కప్ లోనూ చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాక్ తలపడనున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.