Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించే వార్షిక జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది.
క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ప్రతి ఏడాది ప్రకటించే "టీమ్ ఆఫ్ ది ఇయర్"కు ఈసారి కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేశారు.
ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కూడా బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ జట్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌కు కూడా స్థానం దక్కడం విశేషం.
బుమ్రా ఈ ఏడాది మొత్తం 84 వికెట్లు తీసుకొని తన సత్తాను చాటుకున్నాడు. అతని తర్వాత ఉన్న హసరంగ కేవలం 64 వికెట్లు మాత్రమే సాధించగా, వారి మధ్య 22 వికెట్ల తేడా బుమ్రా ప్రాభవాన్ని సూచిస్తోంది.
వివరాలు
ఐసీసీ ట్రోఫీ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర
టీమ్ ఇండియా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
టీ20 ప్రపంచకప్‌లో ముఖ్యమైన స్లాగ్ ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు సాధించాడు.
అంతేకాక, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లోనే పెర్త్ పిచ్‌పై 295 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు.
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బుమ్రా 30 వికెట్లు సాధించగా, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కేవలం 20 వికెట్లకే పరిమితమయ్యాడు.
వివరాలు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 జట్టు ఇదే..
ఇంకా, 2024 సీజన్‌లో యశస్వీ జైస్వాల్ తన బ్యాటింగ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు.
మొత్తం 15 మ్యాచ్‌లలో 1478 పరుగులు సాధించిన జైస్వాల్, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 214 పరుగులు చేశాడు.
మూడు శతకాలు, 9 అర్ధశతకాలతో అతను అత్యుత్తమ స్కోరర్‌గా నిలిచాడు, ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఉన్నాడు.
జైస్వాల్ (భారత్) బెన్ డక్కెట్, జోరూట్ (ఇంగ్లాండ్), రచిన్ రవిచంద్ర (న్యూజిలాండ్) హారీ బ్రూక్ (ఇంగ్లాండ్) కమింద్ మెండిస్ (శ్రీలంక) అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా) మాట్ హెన్రీ (న్యూజిలాండ్) బుమ్రా(కెప్టెన్) (భారత్), హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా)