
Phillip Hughes: మైదానంలో ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్లు.. ఫిలిప్ హ్యూస్ నుండి వసీమ్ రజా వరకు!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచంలో కొన్ని భయంకరమైన ఘటనలు క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోవు.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ 2014లో మైదానంలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకరమైన ఘటన కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది.
హ్యూస్ తన జీవితాంతం క్రికెట్‌ను ప్రేమించి, ఆడిన ఈ యువ క్రికెటర్, సీన్ అబాట్ బౌలింగ్‌లో ప్రాణాలు విడిచారు. బంతిని హెల్మెట్‌ను తాకడంతో గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన ప్రస్తుతం పదేళ్లు గడిచినా, క్రికెట్ అభిమానుల మనస్సుల్లో ఇంకా అతి పెద్ద శోకంగా మిగిలిపోతుంది.
ఫిలిప్ హ్యూస్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారెవరో తెలుసుకుందాం.
Details
1. వసీమ్ రజా (పాకిస్థాన్)
1952లో పుట్టిన వసీమ్ రజా 2006లో ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడుతున్న సమయంలో గుండెపోటు వచ్చి మైదానంలోనే మృతి చెందాడు.
2. రమణ్ లాంబా (భారత్)
1986-89 మధ్య భారత జట్టులో ఆడిన రమణ్ లాంబా, 1988లో బంతి తలకు తాకి ప్రాణాలు కోల్పోయాడు.
3. రిచర్డ్ బౌమోంట్ (ఇంగ్లండ్)
2012లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి సంబరాలు జరుపుతున్న రిచర్డ్ బౌమోంట్ గుండెపోటుతో కన్నుమూశాడు.
Details
4. డారెన్ రండల్ (దక్షిణాఫ్రికా)
2013లో ఒక లీగ్ మ్యాచ్‌లో డారెన్ రండల్ ప్రాణాలు కోల్పోయాడు. బంతి తలకు తాకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
5. ఇయాన్ ఫోలీ (ఇంగ్లండ్)
1993లో ఇంగ్లండ్ దేశవాళీ క్రికెటర్ ఇయాన్ ఫోలీ ఓ క్లబ్ మ్యాచ్‌లో కంటి కింద బంతి తాకి ప్రాణాలు కోల్పోయాడు.
6. జుల్ఫికర్ బట్టి (పాకిస్థాన్)
2013లో పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో బంతి అతడి ఛాతీని తాకి ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటలన్నీ క్రికెట్ ప్రపంచానికి పెద్ద షాక్‌కు గురి చేశారు.