Page Loader
Border - Gavaskar Trophy: 'ఇనఫ్ ఈజ్ ఇనఫ్':డేవిడ్ వార్నర్ 'యూ టర్న్'వ్యాఖ్యలపై  ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విమర్శలు 
డేవిడ్ వార్నర్ 'యూ టర్న్'వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విమర్శలు

Border - Gavaskar Trophy: 'ఇనఫ్ ఈజ్ ఇనఫ్':డేవిడ్ వార్నర్ 'యూ టర్న్'వ్యాఖ్యలపై  ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విమర్శలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

'భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో నా అవసరం ఉంటే ఓపెనర్‌గా తిరిగి వస్తాను .. అందుకోసం నేను సిద్ధంగా ఉన్నాను' అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతేడాది అతడు టెస్టుల నుంచి రిటైర్‌ అయ్యాడు కానీ, ఇప్పటికీ ఆసీస్‌కు సరైన ఓపెనర్ దొరకలేదా అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, డేవిడ్ వార్నర్‌కు ఆసీస్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్థాలేకర్ ఘాటు కౌంటర్ ఇచ్చింది.

వివరాలు 

భారత్‌తో టెస్టు సిరీస్ అత్యంత కీలకం

''వార్నర్ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. గతేడాది అనూహ్యంగా టెస్టులకు రిటైర్‌ అయ్యాడు. అతడు తీసుకున్న నిర్ణయం పట్ల సెలక్టర్లు తెలివిగా వ్యవహరించలేకపోయారు, దాంతో ఆసీస్‌కు కొత్త ఓపెనర్‌ను సిద్ధం చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు వార్నర్ తిరిగి వస్తున్నాడంటూ చేస్తున్న వ్యాఖ్యలు సమస్యను తిరిగి మొదటికి తీసుకువస్తున్నాయి. భారత్‌తో టెస్టు సిరీస్ అత్యంత కీలకం. వచ్చే ఏడాది చివర్లో ఇంగ్లండ్‌తో యాషెస్‌ సరసన ఆడాల్సి ఉంది. కాబట్టి, ఇప్పటికైనా ఓపెనింగ్‌ స్థానం పై దృష్టి పెట్టాలి. వార్నర్‌ ఓపెనర్‌గా ఇక చాలు. అతడు అవసరం లేదనుకుంటా'' అని స్థాలేకర్ పేర్కొంది.

వివరాలు 

స్మిత్‌ వచ్చినా.. 

ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఓపెనర్‌గా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు కానీ పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగు టెస్టుల్లో కేవలం 171 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే, అతడు తనకు అనుకూలంగా సెకండ్ డౌన్‌లోనే ఆడుతానని ఇప్పటికే చెప్పాడు. చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకనే ఉస్మాన్ ఖవాజాతో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖవాజా కూడా హెడ్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని అభిప్రాయపడ్డాడు.