Paris Olympics Day 5 : పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు జరిగే ఈవెంట్స్ ఇవే.. బరిలో లక్ష్యసేన్, పివి సింధు
పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్స్ లో ఐదు రోజు బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీ, ఫుట్‌బాల్, ట్రయథ్లాస్ వంటి ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి. ఇప్పటికే ఇండియా రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, మహిళల సింగిల్స్ లో పిపి.సింధు తమ తమ గ్రూపుల్లో చివరి మ్యాచులను ఆడనున్నారు. ఈ ఈవెంట్లో నెగ్గితే ముగ్గురూ రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ ఈవెంట్ మధ్యాహ్నం 12.50 గంటల నుంచి ప్రారంభం కానుంది.
జొనాథన్ క్రిస్టీతో తలపడనున్న లక్ష్యసేన్
సింధు, ప్రణయ్ తక్కువ ర్యాంకు కలిగిన ప్రత్యర్థులతో పోటీ పడనున్నారు. ఇక లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ జొనాథన్ క్రిస్టీతో తలపడనున్నారు. బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్ లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టనుంది. మూడేళ్ల క్రితం టోక్సో ఒలింపిక్స్ లో ఆమె కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. బాక్సింగ్ మధ్యాహ్నం 03.50 గంటల నుంచి ప్రారంభం కానుంది. గతేడాది దిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనా స్వర్ణం గెలుచుకుంది.
రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్న భజన్ కౌర్
ఇక పురుషుల 71 కేజీల రౌండ్ ఆఫ్ 16లో ఈక్వెడార్ కు చెందిన జోస్ గాబ్రియేల్ రోడ్రిగ్జ్ టెనోరియాతో నిశాంత్ దేవ్ పోటీపడనున్నాడు. ఆర్చరీలో భజన్ కౌర్ రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నారు. ఇవాళ మహిళల రౌండ్ ఆఫ్ 64లో మాజీ ప్రపంచ నంబర్ వన్ దీపికా కుమారి ఎస్టోనియన్ రీనా పర్నత్ తో తలపడనుంది. ఆర్చరీ మధ్యాహ్నం 03.56 గంటలకు మొదలు కానుంది.
ఆసక్తికరంగా మహిళల ఫుట్ బాల్ మ్యాచ్
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల ఫుట్‌బాల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. ట్రయథ్లాస్‌లో పురుషుల, మహిళల పోటీలు పాంట్ అలెగ్జాండర్ 3లో జరగనున్నాయి. ఈ ఈవెంట్ ఉదయం 11:30 గంటల నుంచి మొదలు కానుంది.
కుబా క్రిస్టిన్ తో పోటీపడనున్న పివి. సింధు
12:50 PM బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ - పివి.సింధు vs కుబా క్రిస్టిన్ 01:24 PM రోయింగ్: పురుషుల సింగిల్స్ స్కల్స్ సెమీ-ఫైనల్ - బల్రాజ్ పన్వర్ 01:40 PM బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ - లక్ష్య సేన్ vs జోనటన్ క్రిస్టీ 01:58 PM ఈక్వెస్ట్రియన్: డ్రస్సేజ్ ఇండివిడ్యువల్ గ్రూప్ స్టేజ్ - అనూష్ అగర్వాలా 02:30 PM టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ R32 - శ్రీజ ఆకుల 03:50 PM బాక్సింగ్: మహిళల 75 కేజీల R16 - లోవ్లినా బోర్గోహైన్
టేబుల్ టెన్నిస్ మహిళ సింగిల్స్ లో మనిక బాత్రా
03:56 PM ఆర్చరీ: మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ R64 - దీపికా కుమారి 04:35 PM ఆర్చరీ: మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ R32 - దీపికా కుమారి (అర్హత ఉంటే) 07:00 PM - మెడల్ ఈవెంట్ షూటింగ్: మహిళల ట్రాప్ ఫైనల్ - రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ (అర్హత సాధిస్తే) 08:30 PM టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ R16 - మనిక బాత్రా 09:28 PM ఆర్చరీ: పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ R64 - తరుణ్‌దీప్ రాయ్