
Team India : టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
టీ20ల్లో భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. నిన్న విశాఖపట్నం వేదికగా జరిగిన టీ20 మ్యాచులో 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు(5) చేధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20ల్లో 209 టార్గెట్‌ను టీమిండియా (Team India) మరో బాల్ మిగిలి ఉండగానే చేధించింది. టీ20ల్లో భారత్ చేధించిన అత్యధిక టార్గెట్‌లు 209 Vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం 2023 208 Vs వెస్టిండీస్, హైదరాబాద్, 2019 207 Vs శ్రీలంక, మొహాలి, 2009 204 Vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 2020 202 Vs ఆస్ట్రేలియా, రాజ్ కోట్, 2013
Details
రెండో స్థానంలో సౌతాఫ్రికా
ఈ జాబితాలో టీమిండియా తర్వాత సౌతాఫ్రికా(4), పాకిస్థాన్(3), ఆస్ట్రేలియా(3) ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే, నిన్న మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భారత్ మరొ బంతి మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించింది. టీమిండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ 80 రన్స్‌తో రాణించడంతో భారత్ విజయం సాధించింది.