LOADING...
SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ
సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ

SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
11:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌-2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచులో 6 వికెట్ల తేడాతో లక్నో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితోనే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాటింగ్ విభాగంలో మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు సహా 65), ఆడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) అర్ధశతకాలతో మెరుపు ప్రదర్శన కనబరిచారు.Embe

Details

హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ

ఇక నికోలస్ పూరన్ 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసి మద్దతుగా నిలిచాడు. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం నాలుగు వికెట్ల నష్టంతో 18.2 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59 పరుగులు చేసి విధ్వంసాత్మక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతనికి తోడుగా హెన్రీ క్లాసెన్ (47), ఇషాన్ కిషన్ (35), కుసల్ మెండిస్ (32)లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి విజయానికి బాటలు వేసారు. లక్నో బౌలింగ్ విభాగంలో దిగ్వేష్ సింగ్ రెండు వికెట్లు తీయగా, విలియం ఓ'రూర్క్ ఒక్క వికెట్ సాధించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపు