Page Loader
Pakistan : న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. పాక్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్
న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. పాక్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్

Pakistan : న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. పాక్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు అటు టీ20 సిరీస్‌ను చేజార్చుకున్నా, ఇటు వన్డేల్లోనూ దారుణ ప్రదర్శనతో నిలవలేకపోతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన పాక్, వన్డే సిరీస్‌లోనూ వరుస ఓటములతో కుంగిపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే పాక్ సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ నిరాశ మధ్యే పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినందుకు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి ఓ ఓవర్ తక్కువగా వేసినందుకు మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Details

స్లో ఓవర్ రేట్ కు పాల్పడిన ఐసీసీ

పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన తప్పును అంగీకరించడంతో, అధికారిక విచారణకు అవసరం లేకుండా ఐసీసీ గురువారం ధ్రువీకరించింది. ఇది వరుసగా రెండోసారి పాక్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది. తొలి వన్డేలోనూ రెండు ఓవర్లు తక్కువగా వేసి 10 శాతం ఫైన్‌కు గురైంది. తొలి వన్డేలో 73 పరుగుల తేడాతో ఓడిన పాక్, రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లాంటి క్రికెటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇక చివరి వన్డే శనివారం మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనుంది. కనీసం ఈ మ్యాచ్‌ను గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ ఆశపడుతోంది.