Page Loader
DC vs MI : పోరాడి ఓడిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ముంబై విజయం
పోరాడి ఓడిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ముంబై విజయం

DC vs MI : పోరాడి ఓడిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ముంబై విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
11:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్రకు ముంబయి ఇండియన్స్‌ బ్రేక్‌ వేసింది. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ముంబయి తమ రెండో గెలుపును నమోదు చేసింది. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని ముంబయి జట్టు ఉత్కంఠభరిత పోరులో దిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 18 మరోసారి విఫలమయ్యారు. ఐదో ఓవర్లో విప్రజ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. మరో ఓపెనర్‌ రికెల్టన్‌ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు.

Details

3 వికెట్లు తీసిన కరణ్ శర్మ

తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ 28 బంతుల్లో 40 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు.చివర్లో నమన్‌ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో నాటౌట్‌గా 38 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరుకు అందించారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లు, ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు. లక్ష్యచేధనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. కరుణ్‌ నాయర్‌ మాత్రమే సమర్థవంతంగా పోరాడాడు. అతను 40బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు నిరాశపరిచారు. ముంబయి బౌలింగ్‌లో కరణ్ శర్మ 3 వికెట్లు తీసి కీలకంగా రాణించాడు. చాహర్‌, బుమ్రా, శాంట్నర్‌ చెరో వికెట్‌ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

12 పరుగుల తేడాతో ముంబై విజయం