Page Loader
MS Dhoni New Look : కొత్త హెయిర్ స్టైల్‌లో ధోని లుక్ అదిరిపోయిందిగా!
కొత్త హెయిర్ స్టైల్‌లో ధోని లుక్ అదిరిపోయిందిగా!

MS Dhoni New Look : కొత్త హెయిర్ స్టైల్‌లో ధోని లుక్ అదిరిపోయిందిగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2023
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించి క్రికెట్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకానీ మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మూడు సంవత్సరాలు గడిచినా మహీ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ క్రికెటర్లలో ధోని ఒకరు. తాజాగా ధోని తన కొత్త హెయిర్ స్టైల్‌తో సోషల్ మీడియాని షేక్ చేశాడు. యాడ్ షూట్ కోసం ధోని సరికొత్తగా హెయిర్‌కట్ చేయించాడు. టాప్ హెయిర్ స్టయిలిస్ట్ ఆలీమ్ హకిమ్ ధోనికి సరికొత్త హెయిర్ స్టైల్‌ను చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో హకిమ్ పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న ధోనీ న్యూ లుక్ ఫొటోలు