Page Loader
ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి, విధ్వంసం సృష్టించిన ధృవ్ జురెల్
ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సత్తా చాటిన ధృవ్ జురెల్

ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి, విధ్వంసం సృష్టించిన ధృవ్ జురెల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ చివరి వరకూ పోరాడినా పంజాబే విజయాన్ని సాధించింది. ముఖ్యంగా రాజస్థాన్ తరుపున ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ధృవ్ జురెల్ 15 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ రెండో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధృవ్ జురల్ అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ విజయానికి 30 బంతుల్లో 74 అవసరం కావడంతో అతను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. స్టార్ హిట్ మేయర్(36) కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

జురెల్

జురెల్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఆటగాడు

వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడుతూ 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో 16 పరుగులు అవసరం కాగా.. కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన జురెల్ జనవరి 21, 2001న జన్మించాడు. 2020 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా పనిచేశాడు. వికెట్ కీపర్‌గా మూడు ఇన్నింగ్స్‌లలో 89 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ మెగా వేలంలో అతన్ని 20 లక్షలకు కొనుగోలు చేసింది. కూచ్ బెహార్ ట్రోఫీలో తన తొలి సీజన్‌లో 11 మ్యాచ్‌ల నుండి 736 పరుగులు చేయడంతో సెలెక్టర్ల దృష్టిని అకర్షించాడు.