Page Loader
Duleep Trophy: మొదటి రౌండ్ కి దూరమైన ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్,  ప్రసిద్ధ్ కృష్ణ  
మొదటి రౌండ్ కి దూరమైన ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

Duleep Trophy: మొదటి రౌండ్ కి దూరమైన ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్,  ప్రసిద్ధ్ కృష్ణ  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.ఈరోజు నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరంగా ఉంటారు.కానీ మిగతా స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొననున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ సారి నాలుగు జట్లతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.బీసీసీఐ తాజాగా కొన్నిమార్పులు ప్రకటించింది. ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్,ప్రసిధ్ కృష్ణ మొదటి రౌండ్‌కు దూరమవుతున్నారని తెలిపింది. అంతేకాక, సంజు శాంసన్,నితీశ్ కుమార్ రెడ్డి ఈ టోర్నీకి ఎంపికయ్యారు.బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ఇషాన్ కిషన్ గాయపడ్డారు,సూర్యకుమార్ యాదవ్ కుడి బొటనివేలుకు గాయమైంది. ఈ కారణంగా వారు ఈటోర్నీకి దూరమయ్యారు.వీరంతా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారని బీసీసీఐ పేర్కొంది.

వివరాలు 

నితీశ్ కుమార్‌కి బీసీసీఐ అనుమతి 

ఇండియా-డీ జట్టులో ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ ఎంపికయ్యారు. సూర్యకుమార్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ రిప్లేస్‌మెంట్ గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. నితీశ్ కుమార్‌ను ఈ టోర్నీలో ఆడటానికి అనుమతి ఇచ్చారు.మొదటి నుండే ఇండియా బీలో నితీశ్ ఉన్నప్పటికీ.. ఈ టోర్నీలో పాల్గొనడం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. నితీశ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో బరిలోకి దిగేందుకు అనుమతి పొందాడు. మహ్మద్ సిరాజ్,ఉమ్రాన్ మాలిక్,రవీంద్ర జడేజా కూడా గాయాలు, ఇతర కారణాలతో దులీప్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం,బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాల్లో జరగనున్నాయి. మొదటి రౌండ్‌కు ఎంపిక చేసిన నాలుగు జట్ల వివరాలు, మ్యాచ్ షెడ్యూల్ షెడ్యూల్ పూర్తి వివరాలు..

వివరాలు 

నాలుగు జట్ల వివరాలు

ఇండియా ఏ: శుభ‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావెరప్ప , కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్. ఇండియా బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్.

వివరాలు 

నాలుగు జట్ల వివరాలు

ఇండియా సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్. ఇండియా డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్, సంజు శాంసన్.

వివరాలు 

దులీప్ ట్రోఫీ షెడ్యూల్ 

సెప్టెంబరు 5 - టీమ్ ఏ Vs టీమ్ బీ (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు) సెప్టెంబరు 5 - టీమ్‌ సీ Vs టీమ్ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం) సెప్టెంబరు 12 - టీమ్ ఏ Vs టీమ్‌ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం) సెప్టెంబరు 12 - టీమ్‌ బీ Vs టీమ్‌ సీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బీ', అనంతపురం) సెప్టెంబరు 19 - టీమ్‌ బీ Vs టీమ్‌ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బీ', అనంతపురం) సెప్టెంబరు 19 - టీమ్‌ ఏ Vs టీమ్‌ సీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం)