LOADING...
Fifa World Cup: 2026 వరల్డ్‌కప్‌పై హీట్ డేంజర్ అలర్ట్.. ఫిఫాపై శాస్త్రవేత్తల హెచ్చరిక
2026 వరల్డ్‌కప్‌పై హీట్ డేంజర్ అలర్ట్.. ఫిఫాపై శాస్త్రవేత్తల హెచ్చరిక

Fifa World Cup: 2026 వరల్డ్‌కప్‌పై హీట్ డేంజర్ అలర్ట్.. ఫిఫాపై శాస్త్రవేత్తల హెచ్చరిక

వ్రాసిన వారు Moogati Shabari
May 14, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 పురుషుల ఫుట్‌ బాల్ వరల్డ్‌ కప్ సందర్భంగా తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య ఆటగాళ్ల భద్రతపై ఫిఫా తీసుకుంటున్న చర్యలు సరిపోవని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హీట్ సేఫ్టీ నిబంధనలు ఆటగాళ్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యం, వాతావరణ మార్పులు, క్రీడా ప్రదర్శనల రంగాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు ఫిఫాకు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో ఫిఫా అమలు చేస్తున్న మార్గదర్శకాలు ప్రస్తుత శాస్త్రీయ పరిశోధనలకు అనుగుణంగా లేవని, వాటిని సమర్థించడం కష్టమని పేర్కొన్నారు.

వివరాలు

కూలింగ్ బ్రేక్స్ ఇవ్వాలని డిమాండ్..

తీవ్ర వేడి పరిస్థితుల్లో మ్యాచ్‌లను వాయిదా వేయడం లేదా ఆలస్యం చేయడానికి స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని, అలాగే ఎక్కువ సమయం పాటు కూలింగ్ బ్రేక్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఏడాది అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న టోర్నమెంట్‌లో అధిక ఉష్ణోగ్రతలు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఉపయోగించనున్న 16 స్టేడియాల్లో 14 స్టేడియాల్లో ప్రమాదకర స్థాయికి మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రత్యేకంగా దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఉత్తర మెక్సికో ప్రాంతాల్లో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని, మరింత వేడి తరంగాల సమయంలో అవి 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

వివరాలు

ఆటగాళ్ల సంక్షేమం కోసం చర్యలు..

ఉష్ణోగ్రతలతో పాటు తేమ, గాలివేగం, ఎండ తీవ్రత వంటి అంశాలను కలిపి చూసినప్పుడు ఆటగాళ్ల శరీరంపై తీవ్రమైన హీట్ స్ట్రెస్ ప్రభావం పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆటగాళ్లు, రిఫరీలు, అభిమానులు, వాలంటీర్లు, సిబ్బంది ఆరోగ్యం, భద్రతకు ఫిఫా కట్టుబడి ఉందని ఆ సంస్థ స్పష్టం చేసింది. టోర్నమెంట్ ప్లానింగ్‌లో భాగంగా వాతావరణ సంబంధిత ప్రమాదాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చర్యల విషయానికి వస్తే.. ఆటగాళ్ల సంక్షేమం కోసం ప్రతి మ్యాచ్‌లో రెండు అర్ధభాగాల్లో తప్పనిసరిగా మూడు నిమిషాల కూలింగ్ బ్రేక్ అమలు చేయాలని ఫిఫా నిర్ణయించింది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది.

Advertisement

వివరాలు

ప్రమాదకంరగా హీట్ స్ట్రెస్..

అలాగే అన్ని అవుట్‌డోర్ మ్యాచ్‌లలో సాంకేతిక సిబ్బంది, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల కోసం క్లైమేట్ కంట్రోల్ బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. క్రీడల్లో వేడి ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే 'వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్' (WBGT) ప్రమాణాన్ని కూడా ఫిఫా వినియోగిస్తోంది. ఇది ఉష్ణోగ్రత, తేమ ప్రభావాలను కలిపి శరీరంపై పడే హీట్ స్ట్రెస్‌ను అంచనా వేస్తుంది. సాధారణంగా WBGT 28 డిగ్రీల సెల్సియస్ దాటితే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు హీట్ స్ట్రెస్ ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు

అభిమానుల కోసం ప్రత్యేక చర్యలు..

ఫిఫా అత్యవసర వైద్య మార్గదర్శకాల ప్రకారం WBGT స్థాయి 32 డిగ్రీలకు చేరుకున్నా లేదా దాటినా, హీట్ సంబంధిత అనారోగ్య సమస్యలు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మ్యాచ్ నిర్వాహకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అభిమానుల కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఫిఫా వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నప్పుడు ప్రేక్షకులు ఫ్యాక్టరీ సీల్ ఉన్న వాటర్ బాటిళ్లు స్టేడియంలోకి తీసుకురావడానికి అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే షేడెడ్ ఏరియాలు, మిస్టింగ్ సిస్టమ్స్, కూలింగ్ బస్సులు, అదనపు తాగునీటి పంపిణీ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.

Advertisement