నేడే భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు.. ఓపెనర్‌గా యశస్వీ, ఇషాన్‌కు నో ఛాన్స్!
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి డొమినికాలోని విండర్స్ పార్క్ వేదిగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ టెస్టులో భారత జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. రోహిత్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు సత్తా చాటాడానికి సిద్ధమయ్యారు. మరోపక్క విండీస్ పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. ఫేలవ ఫామ్‌తో టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా టీమిండియాలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ సహా ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వీ జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇషాన్ కిసాన్ స్థానంలో కేఎస్ భరత్?
ఇక జట్టులో వికెట్ కీపర్లగా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ కు చోటు దక్కింది. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. టీమిండియా తరుపున 5 టెస్టు మ్యాచుల్లో 8 ఇన్నింగ్స్ లు ఆడిన భరత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. అయినా వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. భరత్ అద్భుతంగా కీపింగ్ చేయడంతో ఇషాన్ కిషన్ మరోసారి బెంచ్ పై ఉండే అవకాశం ఉంది.ఒకవేళ మొదటి టెస్టులో భరత్ విఫలమైతే రెండో టెస్టులో ఇషాన్ కిసాన్‌ను ఎంపిక చేయనున్నారు. తొలి టెస్టుకు ఇండియా తుది జట్టు అంచనా రోహిత్ శర్మ, జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రహానే, జడేజా, భరత్/ఇషాన్ కిషన్, అశ్విన్, శార్దూల్, సిరాజ్, జైదేవ్ లేదా సైనీ