Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కల్.. జై షా ప్రకటన
టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరక మేరకు సౌతాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కల్ అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా క్రిక్‌బుజ్‌కి తెలిపారు. మోర్కల్ కాంట్రాక్టు సెప్టెంబర్ 1 నుంచి మొదలు కానుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత్ లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచి మోర్నీ మోర్కల్ భారత్ బౌలింగ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడు.
2018లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మోర్కల్
మోర్నీ మోర్కల్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్‌గా పని చేసిన విషయం తెలిసిందే. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన తర్వాత మోర్నీ మోర్కెల్ ని భారత్ బౌలింగ్ కోచ్ గా నియమించాలని పట్టుబడ్డారు. మోర్కల్‌కు అంతర్జాతీయ, ఐపీఎల్‌లో సక్సెస్ ఫుల్ కోచ్‌గా పేరుంది. 2018లో 39 ఏళ్ల వయస్సులో మోర్కల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. గతేడాది భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు కోచ్‌గా మోర్కల్ పనిచేశారు. ధక్షిణాఫ్రికా తరుపున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడాడు.