LOADING...
Test cricket: బ్రాడ్‌మాన్‌ నుంచి కోహ్లీ వరకూ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే! 
బ్రాడ్‌మాన్‌ నుంచి కోహ్లీ వరకూ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే!

Test cricket: బ్రాడ్‌మాన్‌ నుంచి కోహ్లీ వరకూ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌కు అసలైన సౌందర్యాన్ని చాటే ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌నేనని ఎటువంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్‌ ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లను లోకానికి పరిచయం చేసింది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఎంతగానో ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ,టెస్ట్ క్రికెట్‌కు ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేటితరం ఆటగాళ్లలో చాలా మందికి టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలన్న ఆకాంక్ష ఉంది.కానీ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్య తగ్గుతూ రావడంతో వారికి అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మంది గొప్ప బ్యాటర్లకు టెస్టుల్లో ఆడే అవకాశమే రాలేదు. అయితే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డు మాత్రం ఇప్పటికీ ఆస్ట్రేలియన్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ పేరిటనే ఉంది. ఈ మహా రికార్డు కొలమానంగా శతాబ్దాలుగా నిలిచిపోయింది.

Details

 డాన్ బ్రాడ్‌మాన్‌ గోల్డెన్ రికార్డు

1928 నుంచి 1948 మధ్య కాలంలో బ్రాడ్‌మాన్‌ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడాడు. ఇందులో 80 ఇన్నింగ్స్‌లలో 10 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ సగటు 99.94గా ఉండడం విశేషం. మొత్తం 6996 పరుగులు చేసిన బ్రాడ్‌మాన్‌ తన టెస్టు కెరీర్‌లో 12 డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 334 పరుగులు. ఈ డబుల్ సెంచరీల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరని స్థితిలో ఉంది. ఈ గణాంకాలకు దగ్గరగా వచ్చిన ఆటగాడిగా కుమార్ సంగక్కర పేరు చెప్పుకోవచ్చు.

Details

సంగక్కర అద్భుత ప్రదర్శన 

శ్రీలంక దిగ్గజ వికెట్‌కీపర్ కుమార్ సంగక్కర 134 టెస్టుల్లో 233 ఇన్నింగ్స్‌లు ఆడి 12400 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 57.40, అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 319 పరుగులు. సంగక్కర టెస్టుల్లో 11 డబుల్ సెంచరీలు, 38 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేశాడు. బ్రాడ్‌మాన్ రికార్డు ఛేదించేందుకు అతి దగ్గరగా వచ్చిన ఆటగాడు సంగక్కరే.

Details

లారా - 400 నాటౌట్‌తో చరిత్ర 

వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా 131 టెస్టుల్లో 232 ఇన్నింగ్స్‌ల్లో 11953 పరుగులు చేశాడు. అతని సగటు 52.88, అత్యుత్తమ స్కోరు 400 నాటౌట్. టెస్టుల్లో లారా 9 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టెస్ట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా లారా గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 254 నాటౌట్, సగటు 46.85. కోహ్లీ 7 డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు.

Details

వాలీ హామండ్‌ - ఓ బ్రిటిష్ దిగ్గజం 

ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్ తన 85 టెస్టుల్లో 140 ఇన్నింగ్స్‌లు ఆడి 7249 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 336 నాటౌట్, టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. బ్రాడ్‌మాన్ తర్వాత అలాంటి స్థాయిలో నిలబడ్డ ఆటగాళ్లలో హామండ్‌ కూడా ఒకడు. ఈ గణాంకాలు చూస్తే, టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధించడం ఎంత కష్టమో, బ్రాడ్‌మాన్ స్థాయిని చేరడం అంటే అసాధ్యాన్ని సాధించడమేనన్న విషయం స్పష్టమవుతుంది.