Page Loader
IPL Expensive Players: ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా
ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా

IPL Expensive Players: ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2024
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. ఇప్పటివరకూ 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 15 సార్లు ఐపీఎల్ వేలాలు జరిగాయి. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. మొదటగా 2008లో ఐపీఎల్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనిని రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత 2009లో ఆర్సీబీ కెవిన్ పీటర్సన్‌ని రూ.9.8 కోట్లకు, చెన్నై ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను రూ.9.8 కోట్లు వెచ్చించింది.

Details

2016 వాట్సన్ కోసం 9.5 కోట్లు ఖర్చు చేసిన ఆర్సీబీ

ఇక 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున షేన్ బాండ్‌ను రూ.4.8 కోట్లు, ముంబై ఇండియన్స్ తరుపున కీరన్ పొలార్డ్‌ కూడా రూ.4.8 కోట్లకు అమ్ముడుపోయారు. 2011లో కోల్‌కతా గౌతమ్ గంభీర్‌ను రూ.14.9 కోట్లకు, 2012లో చెన్నై రవీంద్ర జడేజాని రూ.12.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 2013లో ముంబై ఇండియన్స్ గ్లెన్ మాక్స్‌వెల్‌ కోసం రూ.6.3 కోట్లు ఖర్చు చేసింది. 2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువరాజ్ సింగ్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షేన్ వాట్సన్‌ను రూ.9.5 కోట్లకు తీసుకుంది.

Details

24.75 కోట్లు పలికిన మిచెల్ స్టార్క్

2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ బెన్ స్టోక్స్ కోసం రూ.14.5 కోట్లు, 2019లో రాజస్థాన్ రాయల్స్ జయదేవత్ ఉన్కదత్‌ను రూ.8.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2021లో రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరీస్‌ను రూ.16.25 కోట్లకు, 2022లో ముంబయి ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను రూ.15.25 కోట్లకు వేలంలో దక్కించుకుంది. 2023లో పంజాబ్ కింగ్స్ శామ్ కరన్‌ను రూ.18.5 కోట్లు, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇలా ఐపీఎల్ వేలాలలో పలువురు క్రికెట్ దిగ్గజాలు పెద్ద మొత్తాలకు కొనుగోలు అవుతూనే ఉన్నారు.