Page Loader
Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్‌.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి!
ఆడకుండానే డ్రాప్‌.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి!

Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్‌.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెస్ట్‌ క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టెస్ట్‌ ఫార్మాట్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్‌కు భారత టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిషబ్ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అలాగే యువ ఆటగాళ్లు కరుణ్‌ నాయర్‌, సాయి సుదర్శన్‌ టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. జూన్‌ 20 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లీలు రిటైర్‌ అయిన తర్వాత భారత్‌ ఆడనున్న తొలి టెస్ట్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం. సర్ఫరాజ్‌ ఖాన్‌ను జట్టులోంచి తప్పించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Details

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడలేదు

గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌, ఆ తర్వాత జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశాన్ని పొందలేదు. తాజాగా సెలక్టర్లు అతడిపై వేటు వేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. "ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఆ స్థానం నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక శతకం చేసిన తర్వాత ఆత్మతృప్తితో కాకుండా, తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే స్థిరమైన విజయాలు సాధించవచ్చు. జట్టు నుంచి తాను తప్పుకోకూడదని, అవకాశాన్ని వదులుకోవద్దని సర్ఫరాజ్‌కు సూచించారు. అలాగే సర్ఫరాజ్‌ను డ్రాప్‌ చేసిన తీరు పట్ల కూడా గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Details

స్పందించిన అజిత్ అగార్కర్

"బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ తర్వాత రెడ్‌ బాల్ క్రికెట్‌ జరగలేదు. రంజీ మ్యాచ్‌లు జరిగినా గాయం కారణంగా సర్ఫరాజ్‌ పాల్గొనలేకపోయాడు. దీంతో అతడు తన ఫామ్‌ను ప్రూవ్‌ చేసుకునే అవకాశం కోల్పోయాడు. గతంలోనూ ఇలా జరిగిన విషయం నాకు తెలుసు. జట్టు ఓ సిరీస్‌ను కోల్పోతే ఎక్కువగా 13, 14, 15వ స్థానాల్లో ఉన్న ఆటగాళ్లపైనే వేటు పడుతోందని వ్యాఖ్యానించారు. సెలక్షన్ విషయంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పందించారు. సర్ఫరాజ్‌ న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో శతకం చేశాడు. కానీ ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో అతడు పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. అందుకే ప్రస్తుతం టీమ్‌లోకి ఎంపిక చేయలేదు. మా నిర్ణయాలు కొన్ని మందికి నచ్చవచ్చు.. మరికొంత మందికి నచ్చకపోవచ్చని స్పష్టంచేశారు.