
Surya Kumar Yadav : ఆసియా కప్‌కి ముందు టీమిండియాకు శుభవార్త
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ అభిమానులకు ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు గుడ్ న్యూస్ వచ్చింది. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫుల్ ఫిట్‌నెస్‌లోకి తిరిగి వచ్చాడు. చాలా కాలం తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించి, టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించాడు. నెట్స్‌లో చెమటోడ్చిన సూర్య సూర్యకుమార్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, ప్రతి షాట్‌కి పూర్తి శక్తిని వినియోగిస్తున్నాడు. ఒక్కొక్క షాట్ దూకుడుగా, సత్తా చూపుతూ కొట్టడం ద్వారా, అతను తన ఫిట్‌నెస్ మాత్రమే కాదు, ఫామ్‌ను కూడా తిరిగి సంపాదించుకున్నాడని స్పష్టమవుతోంది.
వివరాలు
సర్జరీ తర్వాత పూర్తి ఫిట్‌నెస్
జూన్‌లో సూర్యకుమార్‌కు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతను కోలుకోవడంపై, శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంపై కేంద్రీకృతమయ్యాడు. ఇప్పుడు అతని ఫిట్‌నెస్ స్థాయిని చూసి జట్టు యాజమాన్యం, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసియా కప్‌లో అతని నుండి మంచి ఇన్నింగ్స్‌కి వారు ఎదురుచూస్తున్నారు. ఫామ్‌పై ఆందోళన ' అయితే, ఫిట్‌గా ఉన్నప్పటికీ సూర్యకుమార్ ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తుంది. అతను చివరి 10 ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. రెండు సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్ నుంచి కేవలం 28 పరుగులు మాత్రమే వచ్చాయి.
వివరాలు
యూఏఈ పిచ్‌లలో ప్రదర్శన
ఇప్పటి వరకు సూర్య యూఏఈ పిచ్‌లలో 9 మ్యాచ్‌లు ఆడాడు, వాటిలో 181 పరుగులు నమోదు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 158 ఉంది, కానీ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. ఆసియా కప్‌లో అతని నుండి అద్భుతమైన ప్రదర్శన ఆశిస్తున్నారు.