LOADING...
Team India: భారత జట్టుకు గుడ్ న్యూస్.. అహ్మదాబాద్‌కు శుభ్‌మాన్ గిల్ పయనం
భారత జట్టుకు గుడ్ న్యూస్.. అహ్మదాబాద్‌కు శుభ్‌మాన్ గిల్ పయనం

Team India: భారత జట్టుకు గుడ్ న్యూస్.. అహ్మదాబాద్‌కు శుభ్‌మాన్ గిల్ పయనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2023
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, ఆఫ్గానిస్తాన్ మ్యాచుకు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచులకు దూరమైన శుభమన్ గిల్(Shubman Gill), ఇవాళ చైన్నై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లనున్నాడు. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్న గిల్ పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గిల్ వేగంగా కోలుకుంటున్నారని, త్వరలోనే జట్టులోకి చేరుతాడని సమాచారం. ప్రస్తుతం భారత జట్టు ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ కోసం దిల్లీలో ఉండగా, గిల్ నేరుగా అహ్మదాబాద్ వెళ్తుండటంతో పాకిస్తాన్ మ్యాచుకి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండనుంది. డెంగ్యూ జ్వరం కారణంగా గిల్ ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువకు పడిపోయింది. దీంతో హాస్పిటల్‌లో అతడ్ని అడ్మిట్ చేయాల్సి వచ్చింది

Details

మెడికల్ టీమ్ పర్యవేక్షణలో గిల్

గిల్ వేగంగా కోలుకుంటున్నాడని, ముందస్తు జాగ్రత్తగానే అతణ్ని ఆస్పత్రిలో చేర్పించామని భారత బ్యాటింగ్ కోచ్ రాథోడ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం మెడికల్ టీమ్ పర్యవేక్షణలో గిల్ ఉన్నాడని, త్వరలోనే అతడు కోలుకుంటాడని ఆశిస్తున్నామని, ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం తమ జట్టుకు అనుభవం ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉందని, ఏ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో అందరికీ తెలుసు అని, ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన ఆట ఉంటుందని, ఈసారి కచ్చితంగా మెరుగ్గా రాణిస్తామని రాథోర్ వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది.