IND vs Afghan: ఇవాళ అఫ్గాన్‌తో తలపడనున్న భారత్.. అందరి చూపు అతనిపైనే!
వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన భారత్, నేడు దిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో ఈసారి భారత్ టాప్ ఆర్డర్ రాణిస్తే ఇక దిల్లీ వేదికపై పరుగుల వరద ఉండొచ్చు. మరోవైపు బంగ్లాదేశ్ చేతిలో ఓడిన ఆప్గాన్ ఈసారి భారత్‌పై గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆప్గాన్ జట్టును తక్కువ అంచనా వేస్తే పోరపాటే. ఆ జట్టు కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ ఇప్పటికే గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. టీమిండియా స్పిన్నర్ల కంటే తమ జట్టులోనే బలమైన స్పిన్నర్లు ఉన్నారంటూ షాహిదీ పేర్కొన్నారు. ఆ జట్టులో రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ నబీ ఏ సమయంలోనే మ్యాచును మలుపు తిప్పగలరు.
అందరి చూపు కోహ్లీపైనే
ఇక భారత్ తరుఫున లోకల్ హీరో విరాట్ కోహ్లీ (Virat Kohli) సొంతగడ్డపై ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందరి చూపు అతనిపైనే ఉంది. ఇండియా, ఆప్ఘనిస్తాన్ ఇప్పటివరకూ మూడు వన్డేల్లో తలపడ్డాయి. రెండు మ్యాచుల్లో టీమిండియా గెలవగా, ఒకటి టైగా ముగిసింది. తొలి మ్యాచ్ 2014 మార్చి 5న జరగనుంది. ఈ మ్యాచులో ఇండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2018 సెప్టెంబర్ 25న ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక చివరిసారిగా 2019 వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు పోటీపడినప్పుడు ఇండియా 11 పరుగుల తేడాతో గెలిచింది.
ఇరు జట్లలోని ఆటగాళ్లు వీరే
దిల్లీ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇక్కడ జరిగిన తొలి వరల్డ్ కప్ మ్యాచులో సౌతాఫ్రికా, శ్రీలంక కలిపి 700కు పైగా రన్స్ చేశాయి. ఇండియా, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభకానుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత జట్టు రోహిత్ (కెప్టెన్), ఇషాన్, విరాట్, శ్రేయాస్, రాహుల్, హార్దిక్, జడేజా, కుల్దీప్, షమి/అశ్విన్, బుమ్రా, సిరాజ్. అఫ్ఘాన్ జట్టు గుర్బాజ్, జద్రాన్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది(కెప్టెన్), నజీబుల్లా, నబీ, అజ్మతుల్లా, రషీద్, ముజీబుర్, నవీన్‌ఉల్‌హక్, ఫజల్‌హక్.