IPL 2025 Retentions: ఐపీఎల్ 2025లో ఫ్రాంచేజీలకు స్టార్ల ఆటగాళ్లు గుడ్ బై.. వేలంలోకి కీలక ప్లేయర్లు!
పాత జట్లను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ప్రముఖ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ ప్రకారం, ప్రతి ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటెన్ చేసుకోవచ్చు. వేలం కోసం అన్ని ఫ్రాంఛైజీలకు రూ.120 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇక రిటెన్షన్ కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయవచ్చు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత జట్టును వీడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతేడాది ముంబయి ఇండియన్స్ తరుపున రోహిత్ శర్మ విఫలమయ్యాడు.
పంత్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆర్సీబీ
ఈ పరిస్థితుల్లో జట్టులో మార్పులు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. అంతేకాకుండా, రోహిత్ ఐపీఎల్‌లో తన కెప్టెన్సీ అనుభవంతో కొత్త జట్టుకు చేరాలని భావిస్తున్నాడు. 2022లో రిషబ్ పంత్ ఒక కారు ప్రమాదానికి గురైన తర్వాత, రిషబ్ ఇప్పుడు వేలంలోకి వెళ్లాలని భావిస్తున్నాడు, ఎందుకంటే అతను రూ.18 కోట్లకంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతానని ఆశిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తుంది.
లక్నో జట్టును వీడనున్న కేఎల్ రాహుల్?
లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ను వేలంలోకి వదిలేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కాలంలో రాహుల్ ఫామ్ కోల్పోయాడు. దీని కారణంగా అతని జట్టుకు నష్టం కలిగినట్లు యాజమాన్యం భావిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఆసక్తిగా చూస్తోంది. ఈ మొత్తం పరిణామాలు ఐపీఎల్ 2025 కోసం ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. రిటెన్షన్ ప్రక్రియ క్రమంగా జరుగుతున్న నేపథ్యంలో, స్టార్ ప్లేయర్లను కొత్త జట్లలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.