2023లో వన్డేలకు ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గుడ్‌బై..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో సీనియర్లుగా మారుతున్న స్టార్ ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా ఫార్మాట్లో రాణించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్టార్ ఆటగాళ్ల దృష్టి ఫ్రాంఛేజీల వైపు మళ్లుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఆడి రిటైరయ్యే యోచనలో ఆ స్టార్ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం.
న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ ట్రెంట్ బౌల్ట్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రాణిస్తున్నాడు. 99 వన్డే మ్యాచ్‌ల్లో 187 వికెట్లను తీశాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం.
వేన్ పార్నెల్ 2009లో ధక్షిణాఫ్రికా తరుపున అరంగేట్రం చేశాడు. 33 అతడు 72 వన్డేల్లో 98 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ సీనియర్ ఆటగాడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఫాఫ్ డుప్లెసిస్
వన్డేలకు గుడ్‌బై చెప్పే యోచనలో ఫాఫ్ డుప్లెసిస్
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ 129 వన్డేల్లో 25.13 సగటుతో 2,212 పరుగులు చేశాడు. వన్డేల్లో 99 వికెట్లు కూడా పడగొట్టాడు. మొయిన్ అలీ వన్డేలకు శాశ్వితంగా గుడ్‌బై చెప్పి టీ20లలో కొనసాగే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ క్రికెట్ అలెక్స్ హేల్స్ ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్‌లపై దృష్టి పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. 70 వన్డేలు ఆడిన హేల్స్ 37.79 సగటుతో 2,419 పరుగులు చేశాడు. 2019లో హేల్స్ ఇంగ్లండ్ తరఫున అలెక్స్ చివరి వన్డే ఆడాడు.
ఫాఫ్ డుప్లెసిస్ ఇక అంతర్జాతీయ క్రికెట్‌ను వీడకపోవడం ఆశ్చర్యకరం. 143 వన్డేల్లో ఫాఫ్ 47.47 సగటుతో 5,507 పరుగులు చేశాడు. టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించినా.. వన్డేలు, టీ20లను ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పి.. టీ20లపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.