రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరో చెప్పేసిన గూగుల్ ఏఐ!
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వయస్సు రీత్యా 36 ఏళ్లు రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు కన్పించడం లేదు. విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్ టీమిండియాను టెస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంచినప్పటికీ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో విఫలమయ్యాడు. రోహిత్ తర్వాత టీమిండియాకు టెస్టు కెప్టెన్ గా ఎవరైతే బాగుంటుందని Google AI(గూగుల్ ఏఐ)ని అడిగితే ఎవరూ ఊహించని పేర్లను చెప్పింది. గూగుల్ ఏఐ తన తొలి ఆప్షన్ గా కేఎల్ రాహుల్ ను వెల్లడించింది. కేఎల్ రాహుల్ ఇదివరకే బంగ్లాదేశ్‌తో టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ లో టీమిండియా గెలుపొందింది.
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శుభ్‌మాన్ గిల్ పేర్లను వెల్లడించిన గూగుల్ ఏఐ
వైస్ కెప్టెన్ హోదాలో పనిచేసిన కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ తో ప్రస్తుతం జట్టులో స్థానం కోల్పోయాడు. మోకాలి సర్జీరీ కారణంగా ఆటకు దూరమైన అతను టీమిండియాకు ఎప్పుడు ఆడతాడో క్లారిటీ లేదు. గూగుల్ ఏఐ రెండో ఆప్షన్ గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరును ప్రకటించింది. గతేడాది కారు ప్రమాదంలో గాయపడిన అతను ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. ఇటీవల తన బ్యాట్ తో సంచనాలు సృష్టిస్తున్న శుభ్‌మాన్ గిల్ ను గూగుల్ ఏఐ మూడో ఆప్షన్ గా ఎంచుకుంది. ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచిన అతను డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. టెస్టు క్రికెట్‌లో కెప్టెన్ గా గిల్ సమర్థుడని గూగుల్ ఏఐ వెల్లడించింది.