
GT vs KKR : కోల్‌కతాను చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్ టైటాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 90 పరుగులతో చెలరేగాడు. లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.
కోల్‌కతా తరపున అజింక్యా రహానె 50 పరుగులతో ఒక్కడే పోరాడగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
Details
రాణించిన గుజరాత్ బౌలర్లు
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లు పడగొట్టాడు.
మిగతా బౌలర్లలో ముహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, ఇషాంత్ శర్మలు తలో వికెట్ తీశారు.
ఈ విజయం గుజరాత్ టైటాన్స్‌ను పాయింట్స్ టేబుల్‌లో మరింత బలోపేతం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
39 పరుగుల తేడాతో గుజరాత్ విజయం
Match 39. Gujarat Titans Won by 39 Run(s) https://t.co/TwaiwD55gP #KKRvGT #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 21, 2025