
Hardik Pandya: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు.
బౌలింగ్‌లో మ్యాజిక్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడించాడు. ఈ మ్యాచ్‌లో మిగతా బౌలర్లు పరుగులు సమర్పించుకున్నా హార్దిక్ మాత్రం తన స్పెల్‌లో విజృంభించాడు.
నాలుగు ఓవర్లలో 36 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌కు ఇదే తొలి ఫైవ్ వికెట్ హాల్ కావడం విశేషం.
అంతేకాదు టీ20 ఫార్మాట్‌లోనూ ఇది అతనికి తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. ఈ అద్భుత ప్రదర్శనతో పాండ్యా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Details
ఐపీఎల్‌లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన తొలి కెప్టెన్
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ చరిత్రలో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించలేదు.
అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కూడా హార్దిక్ రికార్డు సృష్టించాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. 2009 ఐపీఎల్ సీజన్‌లో డెక్కన్ చార్జర్స్‌పై కుంబ్లే కెప్టెన్‌గా 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ఇప్పుడు హార్దిక్ పాండ్యా 5/36తో కుంబ్లే రికార్డును అధిగమించాడు.
Details
అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా పాండ్యా
హార్దిక్ పాండ్యా మరో అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు.
కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే తన ఐపీఎల్ కెరీర్‌లో 30 వికెట్లు పడగొట్టగా, తాజాగా హార్దిక్ కూడా 30 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్లు
5/36 - హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)
4/16 - అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)
4/16 - అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)
4/17 - జేపీ డుమిని (ఢిల్లీ డేర్‌డెవిల్స్)
4/21 - షేన్ వార్న్ (రాజస్తాన్ రాయల్స్)
Details
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు
57 - షేన్ వార్న్
30 - హార్దిక్ పాండ్యా
30 - అనిల్ కుంబ్లే
25 - రవిచంద్రన్ అశ్విన్
21 - పాట్ కమ్మిన్స్