Rohit Sharma-Axar Patel: హ్యాట్రిక్ మిస్.. అక్షర్ పటేల్‌కు రోహిత్ శర్మ స్పెషల్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు విజయంతో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ అవకాశాన్ని చేజార్చిన కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
అక్షర్‌కు క్షమాపణలు చెబుతూ, అతడికి డిన్నర్ ఆఫర్ చేశాడు. అది చాలా సులభమైన క్యాచ్ అని, ఆ క్యాచ్ పట్టుకోవాల్సిందని రోహిత్ శర్మ చెప్పారు.
అందుకోసం తాను స్లిప్‌లో సిద్ధంగా ఉన్నానని, కానీ చివరి క్షణంలో అది జారిపోయిందన్నారు.
అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యేలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నానని, బహుశా అతడిని డిన్నర్‌కు తీసుకెళ్తానేమోనని రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు.
Details
హ్యాట్రిక్ మిస్ ఎలా జరిగింది?
బంగ్లా ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌ను స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసాడు.
రెండో బంతికే ఓపెనర్ తంజిద్(25)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు క్యాచ్‌లను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుకున్నాడు.
ఇద్దరు బ్యాటర్లు ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జకీర్ అలీ కూడా స్లిప్‌లో దొరికిపోయాడు.
అక్కడే ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నట్లే కనిపించాడు, కానీ చివరి క్షణంలో బంతి చేతిలో నుంచి జారిపోయింది. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ అవకాశాన్ని కోల్పోయాడు.
ఈ ఘటనపై అక్షర్ పటేల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇదంతా క్రికెట్‌లో సహజమేనని, ఇలాంటి ఘటనలు జరగడం చాలా సాధారణమని తెలియజేశాడు.