
NZ Vs BAN: న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో న్యూజిలాండ్ దూసుకెళ్తుతోంది. శుక్రవారం బంగ్లాతో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ విజయంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఈ మ్యాచులో మొదట బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేధనకు న్యూజిలాండ్ 42.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. మొదట్లోనే రచన్ రవీంద్ర (9) నిరాశపరిచగా, తర్వాత డెవాన్ కాన్వే(45) ఫర్వాలేదనిపించాడు. ఇక కేన్ విలియమ్సన్ 78 (రిటైర్డ్ హర్ట్), మిచెల్ 89* పరుగులతో కివీస్ జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్ తలా ఓ వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
The New Zealand juggernaut rolls on with a third consecutive win at #CWC23 🙌#NZvBAN 📝 https://t.co/NgRL4IBzCs pic.twitter.com/5t9Hte600S
— ICC Cricket World Cup (@cricketworldcup) October 13, 2023