Page Loader
Champion trophy: టాప్ స్కోరర్‌గా నిలిచే బ్యాటర్ అతడే.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ 
టాప్ స్కోరర్‌గా నిలిచే బ్యాటర్ అతడే.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

Champion trophy: టాప్ స్కోరర్‌గా నిలిచే బ్యాటర్ అతడే.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్నా టీమిండియా భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఆ దేశానికి చేరుకున్న రోహిత్ శర్మ సేన ప్రాక్టీస్ ప్రారంభించేసింది. ఈ టోర్నీ గురించి పలువురు మాజీ క్రికెటర్లు పలు అభిప్రాయాలను వెల్లడించింది. వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్రిస్‌ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొన్నట్లుగా, పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఈసారి కూడా భారత్-పాక్‌ ఫైనల్లో తలపడతారని అంచనా వేశారు. ఈసారి టాప్-4 జట్లుగా భారత్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా రావాలని గణాంకాలు సూచిస్తున్నాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ ఈ ఐసీసీ ఈవెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Details

ఛాంపియన్ ట్రోఫీ

టీమిండియా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ ఈ టోర్నీలో టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలుస్తాడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవడానికి దారితీస్తాడని కూడా క్లార్క్‌ అంచనా వేశారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ట్రవిస్‌ హెడ్ పేరు సూచించారు. అయితే ఆస్ట్రేలియా ఫైనల్లో ఓడిపోయి, హెడ్‌ మాత్రం మెరుస్తాడని క్లార్క్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లి అభిమానులు వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈసారి కోహ్లి టాప్ రన్‌స్కోరర్‌గా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడని భావిస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారతదేశం, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు పాల్గొంటున్నాయి.