
ఐదు సెషన్లు ఆడితే ఆరు ఇంజెక్షన్లు తీసుకున్నాను.. చివరి టెస్టుపై ఇషాంత్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా బౌలర్‌గా ఇషాంత్‌శర్మ ఎన్నో ఏళ్ల పాటు సేవలందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో సుదీర్ఘంగా ఆడి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
తన పేస్ బౌలింగ్‌తో అతను ప్రత్యర్థ బ్యాటర్లకు చెమటలు పెట్టించాడు. అయితే 2021 తర్వాత అతని ఫామ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది.
ముఖ్యంగా 2013లో ఇండియా చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ గెలవడంలో ఇషాంత్ దే కీలక పాత్ర చెప్పొచ్చు. ఆ తర్వాత మెల్లగా అతని బౌలింగ్ లో వాడి తగ్గుతూ వచ్చింది.
దీంతో 2016 నుంచి 2021 మధ్య చాలా వరకు టెస్టు మ్యాచుల్లోనే అతను కనిపించాడు. ఇషాంత్ 2016లో తన చివరి వన్డే మ్యాచును ఆడాడు. 2014లో మెల్‌బోర్న్ టెస్టులో గాయంతోనే తాను బౌలింగ్ చేసినట్లు ఇషాంత్ వెల్లడించాడు.
Details
ఇంజెక్షన్స్ తీసుకోవడంతో వరల్డ్ కప్ కు దూరమయ్యాను : ఇషాంత్
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్నప్పుడు మహీ భాయ్ కి అదే చివరి టెస్టు మ్యాచ్ అని, ఆ మ్యాచ్ లోనే తనకు మోకాలి నొప్పి మొదలైందని, షమీ, ఉమేష్, అశ్విన్ బౌలింగ్ అప్పటికే అలసిపోయారని ఇషాంత్ పేర్కొన్నారు.
ఆ మ్యాచులో ఐదు సెషన్లు ఆడితే ఆరు ఇంజెక్షన్లు తీసుకున్నానని, ఈ ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల గాయం తీవ్రత పెరిగి 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌కు దూరమయ్యానని తెలిపారు.
ఆ సమయంలో కోచ్‌గా ఉన్న ఫ్లెచర్ వరల్డ్ కప్ కు సమయం దగ్గరపడుతోందని, ఇంజెక్షన్ తీసుకోవద్దని చెప్పాడని, ఒకవేళ తాను అలా చేస్తే జట్టుకు మోసం చేసినట్లు అవుతుందని భావించి ఇంజెక్షన్ తీసుకొని మ్యాచ్ ఆడానని ఇషాంత్ ఆ మ్యాచ్‌ను గర్తు చేసుకున్నాడు.