
Shubman Gill: టాప్-10లోకి శుభ్‌మన్ గిల్ .. అగ్రస్థానంలోకి హ్యారీ బ్రూక్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అద్భుతంగా పురోగతి సాధించాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో అతను డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో అలరించిన నేపథ్యంలో, అతని ర్యాంకు ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరింది. ఇక మరోవైపు, ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించాడు. అతను 886 రేటింగ్ పాయింట్లు సాధించి, జో రూట్‌ను (868) వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
వివరాలు
ఏడో స్థానంలో రిషభ్ పంత్
భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రిషభ్ పంత్ మాత్రం ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులతో శతకం సాధించిన తర్వాత, ర్యాంకింగ్స్‌లో 16 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం అతను 10వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ - భారత్ మధ్య మూడో టెస్టు జూలై 10న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది.