Page Loader
Ravichandran Ashwin: గెలిచినప్పుడు కూడా నేర్చుకుంటే ఛాంపియన్‌లుగా ఎదుగుతారు : రవిచంద్రన్ అశ్విన్
గెలిచినప్పుడు కూడా నేర్చుకుంటే ఛాంపియన్‌లుగా ఎదుగుతారు : రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: గెలిచినప్పుడు కూడా నేర్చుకుంటే ఛాంపియన్‌లుగా ఎదుగుతారు : రవిచంద్రన్ అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2023
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు ఫర్వాలేదనిపించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకున్నప్పటికీ, టీ20 సిరీస్‌లో మాత్రం పరాజయం పాలైంది. ఐదు మ్యాచుల టీ20ల సిరీస్‌ని 3 -2 తేడాతో చేజార్చుకుని విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా భారత జట్టుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా టీ20 సిరీస్ ఓటమిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. టీ20 సిరీస్ లో భారత్ కు చాలా సానుకూల అంశాలున్నాయని, యువ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, తిలక్ వర్మ, ముఖేష్ కుమార్ కు ఈ పర్యటనలో పుష్కలంగా అవకాశాలు లభించాయన్నారు.

Details

యువ ఆటగాళ్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ఓడిపోయినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటామని, కానీ గెలిచినప్పుడు కూడా నేర్చుకునే వ్యక్తులే ఛాంపియన్లుగా ఎదిగే అవకాశం ఉందని, ఎంఎస్ ధోని, కొంతమంది కోచ్ లు తనతో చెప్పారని అశ్విన్ పేర్కొన్నారు. టీ20 సిరీస్ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని, ముఖ్యంగా 8వ నెంబర్ లో బ్యాటింగ్ కు దిగే బౌలర్లు పరుగులు చేస్తారా లేదా అన్న విషయాన్ని గమనించాలన్నారు. యువ ఆటగాళ్లకు లభించిన అవకాశాలతో ఒకశాతం మెరుగుపడినా, అది భవిష్యత్తుకు శుభసూచకంగా మారుతుందని వెల్లడించారు. రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రస్తుతం టీమిండియా వన్డే, టీ20 జట్టులో అవకాశాలు లభించడం లేదు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.