LOADING...
IND vs AFG: టెస్టులో గిల్‌కు పగ్గాలు.. వన్డేల్లో రోహిత్-విరాట్ హవా
టెస్టులో గిల్‌కు పగ్గాలు.. వన్డేల్లో రోహిత్-విరాట్ హవా

IND vs AFG: టెస్టులో గిల్‌కు పగ్గాలు.. వన్డేల్లో రోహిత్-విరాట్ హవా

వ్రాసిన వారు Moogati Shabari
May 07, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూన్ 2026లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరగనున్న స్వదేశీ సిరీస్ కోసం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు జాతీయ జట్టులో చేరి మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. జూన్ 6 నుంచి 10 వరకు నూతన చండీగఢ్‌లోని ముల్లాంపూర్ స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు. అనంతరం జూన్ 14 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

వివరాలు

గిల్‌కు నాయకత్వ బాధ్యతలు..

ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టులో శుభ మన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. మధ్య వరుసలో దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో పాటు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన ఆయుధంగా ఉండనున్నాడు. వేగవంతమైన బౌలింగ్ దళాన్ని మహమ్మద్ సిరాజ్ ముందుండి నడిపించనున్నాడు. అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్, ఆకాష్ దీప్ తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు.

వివరాలు

వన్డే సిరీస్‌లో సీనియర్ల ఎంట్రీ.. 

వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో భారత జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నాడు. మధ్య ఓవర్లలో జట్టును నిలబెట్టే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తీసుకోనున్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాక జట్టుకు అదనపు బలాన్ని అందించనుంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌లోనూ కీలకంగా మారనున్నారు.

Advertisement

వివరాలు

సిరీస్ షెడ్యూల్ ఇదే..

పేస్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఏకైక టెస్టు మ్యాచ్: జూన్ 6 నుంచి 10 వరకు - ముల్లాంపూర్, చండీగఢ్ తొలి వన్డే: జూన్ 14 - ధర్మశాల రెండో వన్డే: జూన్ 17 - లక్నో మూడో వన్డే: జూన్ 20 - చెన్నై

Advertisement