Page Loader
IND vs ENG: టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్..ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టులకు స్టార్‌ ప్లేయర్ దూరం!
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్..ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టులకు స్టార్‌ ప్లేయర్ దూరం!

IND vs ENG: టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్..ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టులకు స్టార్‌ ప్లేయర్ దూరం!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2024
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది.ఇప్పటికే జడేజా,కే ఎల్ రాహుల్,షమీ జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు,శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది. అతను వెన్ను,గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో చేరినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది వెన్ను గాయానికి అయ్యర్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. శ్రేయస్ తిరిగి ఐపీఎల్‌ 2024తో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

Details 

కోహ్లీ అందుబాటుపై సందిగ్ధం 

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్‌ ఆడిన శ్రేయాస్ నాలుగు ఇన్నింగ్స్‌లలో మొత్తంగా 104 పరుగులు మాత్రమే చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం,మాజీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకు అయితే విరాట్ నుంచి ఎటువంటి సమాచారం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో చివరి మూడు టెస్టులకు రజిత్‌ పాటిదార్‌,సర్ఫరాజ్‌ ఖాన్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.