India vs England: 'సిరీస్‌లో పుంజుకుంటాం'.. తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ కొనసాగుతోంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
పర్యాటక జట్టు నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలోనే భారత్ ఛేదించింది.
అయితే, భారత బ్యాటర్లకు అదృష్టం కలిసొచ్చి గెలిచిందని.. రెండో టీ20లో మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వ్యాఖ్యానించాడు.
చాలా బంతులు గాల్లోకి లేచి ఫీల్డర్లకు దూరంగా వెళ్లడంతో భారత బ్యాటర్లు ఔట్ కాలేదు అని ఆర్చర్ అభిప్రాయపడ్డారు.
అయితే, అవన్నీ జరిగితే టాప్ 6 బ్యాటర్లను 40 పరుగులకే కట్టడి చేసేవారని ఆయన అన్నారు. రెండో మ్యాచ్ చెన్నై వేదికగా శనివారం జరుగనుంది.
వివరాలు
భారత్‌ను 40/6కి కట్టడి చేస్తాం
"ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇతర బౌలర్లతో పోలిస్తే నాకు మరింత సహకరించింది.ఇతర బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. కానీ, భారత బ్యాటర్లకు అదృష్టం కలిసొచ్చింది. కొన్ని బంతులు గాల్లోకి లేచాయి. అవి ఫీల్డర్లకు కాస్త దూరంగా పడ్డాయి. కానీ వచ్చే మ్యాచ్‌లో అవి సరిగ్గా ఫీల్డర్ల చేతుల్లో పడతాయని అనుకుంటున్నాను. అలాగే భారత్‌ను 40/6కి కట్టడి చేస్తాం. భారత్‌లో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి బ్యాటర్లు దూకుడుగా ఆడతారు. ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌లో మేము విజయావకాశాన్ని మిస్ చేసుకున్నాం. తొలుత బ్యాటింగ్‌లో వికెట్లు త్వరగా కోల్పోవడం వల్ల నష్టం జరిగింది. అలాగే ప్రత్యర్థి లక్ష్య ఛేదన సమయంలో పవర్ ప్లే అత్యంత కీలకం.
.
వివరాలు
తరువాత మ్యాచ్‌లో తప్పకుండా గెలుస్తాం: ఆర్చర్
కనీసం మూడు లేదా నాలుగు వికెట్లు తీస్తేనే మేం మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు అవకాశం ఉండేది. అప్పుడు మధ్య ఓవర్లలో ఆట మరోలా సాగేదాన్ని. తొలి మ్యాచ్‌లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తరువాత మ్యాచ్‌లో తప్పకుండా గెలుస్తాం" అని ఆర్చర్ వెల్లడించాడు
తొలి టీ20 మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చాడు.
మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. అభిషేక్ శర్మ (79) విజృంభించదాంతో ఇంగ్లండ్‌కు ఘోర ఓటమి తప్పలేదు.
అతను ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడంతోపాటు తిలక్ వర్మను ఔట్ చేసే అవకాశాన్ని కూడా చేజార్చారు.
అయితే, ఆర్చర్ చెబుతున్నట్లుగా భారత జట్టు ఎక్కువ పొరపాట్లు చేయలేదు.