Page Loader
IND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!
టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

IND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2023
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్విన్ పార్కర్ ఓవల్లో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. భారీ వర్షంతో చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైస్వాల్, రోహిత్, రవీంద్ర జడేజా, అశ్విన్ అర్ధ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ శతకంతో విజృంభించాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు విండీస్ ఆలౌట్ కావడంతో 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

Details

అద్భుతంగా రాణించిన యశస్వీ జైస్వాల్

సెకండ్ ఇన్నింగ్స్ లో 181 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్ వెస్టిండీస్ ముందు 365 పరుగుల టార్గెట్ ను ఉంచింది. లక్ష్య చేధనకు దిగిన విండీస్ 76/2 స్కోరు చేసింది. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన యశస్వీ జైస్వాల్‌ అద్భుతంగా రాణించాడు. రోహిత్ శర్మతో కలిసి (229, 139, 98) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బాజ్‌బాల్‌ను తలపించే విధంగా దూకుడుగా ఆడింది. రోహిత్, జైస్వాల్ 9 ఓవర్లలోనే 90 పరుగులు చేయడం విశేషం. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో 29 సెంచరీలు చేసి ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్‌ రికార్డును సమం చేశాడు.

Details

టెస్టుల్లో వేగవంతమైన ఫిప్టీని నమోదు చేసిన రోహిత్ శర్మ

ఈ టెస్టు సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మూడు ఇన్నింగ్స్ లో కలిపి 240 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ టెస్టు క్రికెట్ లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో రోహిత్ విమర్శకుల నోరు మూయించాడు. మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో విండీస్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.