Ind vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్
విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి టెస్టులో అరంగేట్రం బ్యాటర్ యశస్వీ అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు. రోహిత్ ఔటైనా యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మలు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 229 పరుగులను జోడించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. ప్రస్తుతం యశస్వీ జైస్వాల్(143), విరాట్ కోహ్లీ(36) క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇప్పటికే 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 312/2తో నిలిచింది.
రికార్డును నెలకొల్పిన టీమిండియా ఓపెనర్లు
టెస్టు అరంగ్రేటంలోనే సెంచరీ చేసిన 17వ భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అయితే వెస్టిండీస్‌తో ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా అతను రికార్డుకెక్కాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో తన 10వ సెంచరీని నమోదు చేశాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో రోహిత్ మరో కీలక మైలురాయికి చేరుకున్నాడు. టెస్టుల్లో 3,500 పరుగుల మార్క్‌ను దాటిన 20వ భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.అదే విధంగా రోహిత్ - యశస్వీ జైస్వాల్ మరో రికార్డును నెలకొల్పాడు. విండీస్‌పై ఓపెనర్లుగా అత్యధిక రన్స్ భాగస్వామ్యం(229) నెలకొల్పారు. 2002లో ముంబైలో వెస్టిండీస్ పై సెహ్వాగ్, బంగార్ జోడీ 201 రికార్డును వారు బ్రేక్ చేశారు.