
Ind Vs WI: డొమినికాకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో ఈనెల 12 నుంచి జరిగే మొదటి టెస్టుకు టీమిండియా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. బార్పొడాస్‌లో ప్రాక్టీస్ సెషన్లు పూర్తి చేసుకున్న భారత జట్టు డొమినికాకు చేరుకుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జూలై 12 నుంచి 16 వరకు విండర్స్ పార్క్ స్టేడియంలో మొదటి టెస్టు జరగనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్.. దాదాపు 20రోజుల విశ్రాంతి తర్వాత కరేబియన్ దీవిలో అడుగుపెట్టింది.
మరోవైపు భారత్‌తో సిరీస్‌కు అతృతగా ఉన్నామని, అభిమానులంతా స్టేడియానికి రావాలని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ తెలిపారు.
బీసీసీఐ
వెస్టిండీస్ తో తలపడే టీమిండియా జట్టు ఇదే
జులై 7న జరిగిన వార్మప్ మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, జైస్వాల్ అర్ధ సెంచరీతో రాణించారు. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ రెండు పరుగులతో నిరాశపరిచాడు.
టెస్టు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ పేలవ ప్రదర్శన చేశారు.
వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.