
ENG vs IND: శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 587 ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. 310/5తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 587 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు 114 పరుగులతో క్రీజులో ఉన్న గిల్, రెండో రోజు తన స్కోరును డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. మొత్తం 387 బంతులు ఎదుర్కొన్న గిల్, 30 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 269 పరుగులు చేశాడు. మరోవైపు, ఓవర్‌నైట్ స్కోరు 41తో మైదానంలోకి దిగిన రవీంద్ర జడేజా సెంచరీకి కాస్త దూరంలో ఆగిపోయాడు. అతను 137 బంతుల్లో 10 ఫోర్లు బాదుతూ 89 పరుగులు చేశాడు.
వివరాలు
ఆరో వికెట్‌కు గిల్, జడేజా 203 పరుగుల భాగస్వామ్యం
వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను 103 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు చేశాడు. ఆరో వికెట్‌కు గిల్, జడేజా కలిసి 279 బంతుల్లో 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం గిల్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఏడో వికెట్‌కు 189 బంతుల్లో 144 పరుగులు జోడించారు. తొలి రోజు యశస్వి జైస్వాల్ 87 పరుగులతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు తీసుకున్నాడు. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలదన్నే ప్రదర్శనతో రెండు వికెట్లు తీయగా, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ తలో వికెట్ తీసుకున్నారు.