LOADING...
IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్

IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
11:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ (Asia Cup 2025)లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాక్ జట్టు తక్కువ పరుగులే చేయగలిగింది. చివర్లో షాహీన్ ఆఫ్రిది 33 పరుగులతో రాణించడంతో పాకిస్థాన్ జట్టు గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. లక్ష్య చేధనలో భారత జట్టు 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బ్యాటర్లలో అభిశేక్ శర్మ (31), తిలక్ వర్మ (31), సూర్యకుమార్ యాదవ్ (47*) పరుగులతో రాణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్