ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టిన భారత ప్లేయర్లు.. రెండో ర్యాంక్‌లో అభిషేక్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ (IND vs ENG)లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు.
తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల్లో దూసుకువచ్చాడు. ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్‌కి చేరుకున్నాడు.
ఇంగ్లాండ్‌పై ఐదో టీ20లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అభిషేక్ (Abhishek Sharma) 829 పాయింట్లతో ఉన్నాడు. అగ్రస్థానంలో సన్‌రైజర్స్ జట్టుకు చెందిన అతని భాగస్వామి, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) కొనసాగుతున్నాడు.
వీరిద్దరి తర్వాత తిలక్ వర్మ (803), ఫిల్ సాల్ట్ (798), సూర్యకుమార్ యాదవ్ (738) ఉన్నారు.
వివరాలు
వరుణ్ ర్యాంకింగ్స్‌లో ఎదుగుదల
ఇంగ్లాండ్‌పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఐసీసీ ర్యాంకుల్లోనూ మంచి గుర్తింపు లభించింది.
మూడు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కి చేరుకున్నాడు. విండీస్ బౌలర్ అకీల్ హుసేన్ (707) అగ్రస్థానంలో ఉండగా, అదిల్ రషీద్ (705) రెండో స్థానంలో నిలిచాడు.
వరుణ్ చక్రవర్తి కూడా అదే 705 పాయింట్లతో ఉన్నప్పటికీ, దశాంశాల్లో తేడా కారణంగా రషీద్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు.
మరోవైపు, రవి బిష్ణోయ్ (671) నాలుగు ర్యాంకులు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.
వివరాలు
టెస్టుల్లో బుమ్రా దూకుడు
టెస్టుల్లో బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకులను ఐసీసీ తాజాగా అప్‌డేట్ చేసింది.
బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా (908) అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.
టాప్-10లో బుమ్రాతో పాటు రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. జడేజా (745) తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు.
బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (895) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.
టాప్-10లో కేవలం ఇద్దరు భారత బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. యశస్వి జైస్వాల్ (847) నాలుగో స్థానంలో ఉండగా, రిషభ్ పంత్ (739) తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు.