IND vs ENG 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 436 పరుగులకు ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
టెస్ట్ మ్యాచ్ ప్రారంభమై.. శనివారానికి మూడో రోజు కాగా.. టీమిండియా పూర్తిస్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా 436 పరుగులకు 10వికెట్లను కోల్పోయింది.
దీంతో టీమిండియాలో తొలి ఇన్నింగ్స్‌లో 190పరుగుల ఆధిక్యం సాధించింది.
421/7వద్ద మూడో రోజును ఆటను ప్రారంభించిన టీమిండియా.. కేవలం 15పరుగులకే 3వికెట్లను కోల్పోవడం గమనార్హం.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (87) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) చక్కటి ఇన్నింగ్ ఆడారు.
టీమిండియా
అదరగొట్టిన జడేజా, జైశ్వాల్, రాహుల్
తొలి ఇన్నింగ్స్‌లో జడేజా తన చాటాడు. 180 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 7 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. అతని టెస్టు కెరీర్‌లో ఇది 20వ అర్ధ సెంచరీ.
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 123 బంతులు ఎదుర్కొని 86 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
యశస్వి జైశ్వాల్ కూడా ఇంగ్లండ్‌పై తన అత్యుత్తమ స్కోరు సాధించాడు. 74 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి.