IND Vs NZ: నేడే భారత్-న్యూజిలాండ్ సెమీస్ సమరం.. వెదర్, పిచ్ రిపోర్టు వివరాలివే!
వన్డే వరల్డ్ కప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి లీగ్ దశలో భారత్ అజేయంగా నిలిచింది. ఇవాళ తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ మ్యాచులో పరుగుల వరద ఖాయమని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే పిచ్ పై శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత్ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే అల్ ఔట్ చేసింది .
వర్షం పడే సూచనలు లేవన్న వాతావరణ శాఖ
ఇరు జట్లు గతంలో 117సార్లు తలపడ్డాయి. భారత్ 59 మ్యాచుల్లో గెలుపొందగా, న్యూజిలాండ్ 50 చేసి మ్యాచ్‌ల్లో గెలిచింది. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచుల్లో విజయాలు సాధించాయి. ఇక ఇరు జటలు వరల్డ్ కప్ సెమీఫైనల్లో రెండోసారి తలపడనున్నాయి. ఇక వరల్డ్ కప్ లో ఫామ్ ను బట్టి చూస్తే, న్యూజిలాండ్ కంటే టీమిండియా పటిష్టంగా కనిపిస్తుంది. పగటిపూట వాంఖడే స్టేడియంలో ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. ఇక వర్షం పడే సూచనలు లేవని వాతవరణ శాఖ తెలిపింది.