ఆసియా కప్ ఫైనల్ లో ఎప్పుడూ ఇండియా-పాక్ ఆడలేదు : షోయబ్ అక్తర్
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచులో పాక్ ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్ ఫైనల్ కు చేరాలనే పాక్ క్రికెట్ జట్టు ఆశలు అవిరి అయ్యాయి. ఎలాగైనా ఫైనల్‌లో భారత్‌తో తలపడాలని పాక్ భావించింది. అయితే మ్యాచ్ చివరి క్షణాల్లో శ్రీలంక జట్టును చరిత్ అసలంక విజయపథంలో నడిపించాడు. దీంతో టోర్నమెంట్ నుంచి బాబర్ సేన నిష్క్రమించింది. ఈ ఓటమిపై తాజాగా పాకిస్థాన్ మాజీ షోయబ్ అక్తర్ స్పందించాడు. హరీస్ రవూఫ్, నసీమ్ షా గాయపడిన తర్వాత జట్టులోకి వచ్చిన పాకిస్థాన్ పేసర్ జమాన్ ఖాన్‌ను షోయబ్ అక్తర్ ప్రశంసలతో ముంచెత్తాడు. జమాన్ ఖాన్ ఈ మ్యాచులో ఒక వికెట్ తీయకపోయినా అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడని అక్తర్ పేర్కొన్నారు.
పాక్ ఓటమితో నిరాశ చెందా : అక్తర్
ఆసియా కప్‌లో పాక్ జట్టు అద్భుతంగా రాణించిందని, అయితే దురదృష్టవశాత్తు టోర్నీ నుంచి నిష్క్రమించిందని, ఫైనల్‌లో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఎప్పుడూ జరగలేదని, అయితే శ్రీలంక ఫైనలిస్ట్‌గా అర్హత సాధించిందని పేర్కొన్నారు. టోర్నమెంట్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించడం మంచిది కాదని, ఈ విషయంపై పాకిస్థాన్ ఆలోచించాలని, కెప్టెన్సీని మరింత పదును పెట్టాల్సి ఉండేదని, ఈ ఓటమితో తాను చాలా నిరాశ చెందానని అక్తర్ వెల్లడించారు. ఇక ఆసియా కప్ ఫైనల్ లో ఆదివారం టీమిండియా, శ్రీలంక తలపడనున్నాయి.