WC 2023 IND Vs PAK: 14న భారత్-పాకిస్థాన్ హై ఓల్టోజ్ మ్యాచ్.. భారత్ కు రానున్న పీసీబీ ఛైర్మన్
క్రికెట్ అభిమానులు ఎంతగానే వేచి చూస్తున్న దయాదుల పోరుకు సమయం అసన్నమైంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచు కోసం పాకిస్థాన్ జర్నలిస్టులకు భారత ప్రభుత్వం వీసాలను మంజూరు చేసింది. తాజాగా ఈ మ్యాచును చూసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ (Zaka Ashraf) భారత్ కు రానున్నాడు. ఈ మేరకు పీసీబీ (PCB) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దగ్గరుండి పాకిస్థాన్ జట్టును జకా అష్రఫ్ ప్రోత్సహించనున్నాడు.
పాక్ ప్లేయర్లు ఒత్తిడి లేకుండా ఆడాలి
ఈ నేపథ్యంలో 60 మంది జర్నలిస్టులతో పాటు జకా ఆష్రఫ్ భారత్ గడ్డపై అడుగు పెట్టనున్నారు. తాను గురువారం భారత్ కు పయనం అవుతానని, ఈ మెగా ఈవెంట్ కవర్ చేయడానికి పాకిస్థాన్ జర్నలిస్టులకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చిందని జకా అష్రఫ్ పేర్కొన్నాడు. ఇక వీసాల జారీ విషయంలో భారత రాయబార కార్యాలయం సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. టీమిండియాతో మ్యాచుకు ముందు తమ ఆటగాళ్లు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడాలని ఆయన సూచించాడు.