IND Vs AUS : ప్రపంచ కప్‌లో భారత్ బోణీ.. విజృంభించిన కోహ్లీ, రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది.
రెండు పరుగులకే మూడు కీలక కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఆసీస్ చేసిన 200 పరుగుల టార్గెట్‌ను చేధించడానికి బరిలోకి దిగిన ఇండియాకు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఇక కోహ్లీ(85), కేఎల్ రాహుల్ (97) ఆస్ట్రేలియా బౌలర్ల దాడిని తట్టుకొని 41.2 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించారు.
చివర్లో కోహ్లీ ఔట్ కాగా, పాండ్యాతో కలిసి రాహుల్ భారత్‌ను గెలిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు తీశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్
India overcome an early wobble to take their opening #CWC23 by a comfortable margin 💪#INDvAUS 📝: https://t.co/Qh7kBjviYJ pic.twitter.com/pbTH3UMLkf
— ICC (@ICC) October 8, 2023